ఈ నెల 15, 17తేదీల్లో ఏపీలో మోడీ ప్రచారం..

ఏపీలో జరగబోయే ఎన్నికల్లో టిడిపి – జనసేన – బిజెపి కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం ఫై దృష్టి సారించారు. ఈ ప్రచారంలో ప్రధాని మోడీకూడా పాల్గొన బోతున్నారు. ఈనెల 15న విశాఖలో మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో ఆయన పర్యటించనున్నారు. అదే రోజున చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీడీపీ, జనసేన సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారని సమాచారం.

2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అయితే 2024 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పార్టీల అధినేతలు వెల్లడించారు. ఇప్పటికే, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ.. టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ.. జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి.