పవన్ కళ్యాణ్ ను వదలని అంబటి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైసీపీ మంత్రి అంబటి రాంబాబు వదలడం లేదు. మొదటి నుండి పవన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న రాంబాబు..ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలుకావడం తో మరింతగా ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో జనసేన ..బిజెపి , టిడిపి తో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి , బిజెపి కోసం తన సీట్లను తగ్గించుకున్నారు. మొన్నటి వరకు 23 సీట్లలో పోటీ చేస్తున్నట్లు తెలిపిన పవన్..నిన్న బిజెపి తో సమావేశం అనంతరం 21 చేరిపోయాడు.

దీంతో మరోసారి పవన్ ఫై రాంబాబు తనదైన స్టయిల్ లో విమర్శలు చేసారు. ఎక్కడ నెగ్గాలో తెలియనోడు.. ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు.. అంటూ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ అంబటి రాంబాబు ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మొన్నటికి మొన్న సీఎం సీఎం అని అరిసిన ఓ కాపులారా! సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సీఎం అంటే చీటింగ్ మనిషా? అంటూ అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.