20 దేశాలపై ఆంక్షలు విధించిన సౌదీ అరేబియా

రియాద్‌: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు సౌదీ ప్రభుత్వం 20 దేశాలపై తాత్కాలికంగా ప్రయాణ ఆంక్షలను విధించింది. ఆంక్షల్లో భాగంగా ఈ 20 దేశాలకు చెందిన వారు సౌదీలోకి అడుగుపెట్టేందుకు అనుమతులు ఉండవు. ఆరోగ్యశాఖ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఆంక్షల నుంచి దౌత్యవేత్తలను, వైద్య అభ్యాసకులు.. వారి కుటుంబసభ్యులు, సౌదీ దేశస్థులను మినహాయిస్తున్నట్టు పేర్కొంది.


కాగా, గడిచిన 14 రోజుల్లో ఈ 20 దేశాల ద్వారా ప్రయాణం చేసిన ఇతర దేశస్థులపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, సౌదీలో ఇప్పటివరకు 3.67 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి 6,370 మంది ప్రాణాలు కోల్పోయారు.

సౌదీ ఆంక్షలు విధించిన దేశాల జాబితా ఇదే:


•ఇండియా
•యూఏఈ
•అర్జెంటీనా
•జర్మనీ
•అమెరికా
•ఇండొనేషియా
•బ్రిటన్
•దక్షిణ ఆఫ్రికా
•ఫ్రాన్స్
•పాకిస్థాన్
•ఈజిప్ట్
•లెబనాన్
•ఐర్లాండ్
•ఇటలీ
•బ్రెజిల్
•పోర్చుగల్
•టర్కీ
•స్వీడెన్
•స్విట్జర్లాండ్
•జపాన్


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/