లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న సర్పంచ్‌లు

కరోనా కట్టడిలో భాగంగా సొంతవారిని సైతం గ్రామాలలోకి అనుమతించని తెలంగాణ సర్పంచ్‌లు

strict lockdown
strict lockdown

తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించారు.తమ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రజా నాయకులు అందరూ కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ సూచించారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కి గ్రామ సర్పంచులు సైతం ముందుండి తమ గ్రామాలను కరోనా బారినుండి కాపాడుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలంలోని గోసాయిపల్లి గ్రామ సర్పంచ్‌ సాయిగౌడ్‌. సాయిగౌడ్‌ తల్లి తులశమ్మ మరో గ్రామంలో ఉన్న తమ బందువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో గ్రామంలో ప్రవేశిస్తున్న తులశమ్మను సాయిగౌడ్‌ అడ్డుకుని తిరిగి వారి బందువుల ఇంటికి పంపించాడు. లాక్‌డౌన్‌ సమయంలో బయటినుండి గ్రాయంలోకి ఎవరిని అనుమతించేది లేదని కరాఖండిగా చెప్పేశాడు. ఇటీవల ఓ మహిళా సర్పంచ్‌ కూడా వారి గ్రామ సరిహద్దులో కర్ర చేత పట్టి కాపలాగా నిలుచున్నది. అంతేకాక పలు ప్రాంతాలలో ” మీరు మా గ్రామానికి రావోద్దు.. మేము మీ గ్రామానికి రాము”. అంటూ బ్యాన్‌ర్‌లు ప్రదర్శించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/