వారిద్దరూ సహజసిద్ద నాయకులు

మైదానంలో ఉన్నంత సేపు విజయం సాధించాలనే కసి వారిలో కనిపిస్తుంది

corey anderson
corey anderson

హైదరాబాద్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పరిమిత ఒవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇద్దరు కూడా సహజసిద్ద నాయకులని న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోరె అండర్సన్‌ పేర్కోన్నాడు. బుధవారం స్టార్‌స్పోర్ట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గోన్న అండర్సన్‌ ఈ విధంగా పేర్కోన్నాడు. ఐపిఎల్‌ సందర్బంగా కోహ్లీ, రోహిత్‌ల నాయకతంలో ఆడిన అనుభవం ఉంది. మ్యాచ్‌లో ఇద్దరి ఆలోచన తీరు ఒకే విధంగా ఉంటుందని అండర్సన్‌ తెలిపాడు. మైదానంలో ఉన్నంత సేపు విజయం సాధించాలనే కసి వారిలో కనిపిస్తుందని చెప్పాడు. కాగా అండర్సన్‌ ముండబై ఇండియన్స్‌,రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఆడాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/