అమిత్ షాకు ప్రశ్నలు సంధించిన రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆత్మగౌరవంపై మోడీ దాడి చేశారని మండిపాటు

హైదరాబాద్: అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నలను సంధించి.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఛీ’ఆర్ఎస్ తో సావాసం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోడీ దాడి చేశారని ఆరోపించారు. సెంటిమెంట్, ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనే మీ కుతంత్రం రాష్ట్రంలో పారదని తేల్చి చెప్పారు.

‘కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యమేంటి? పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలు.ధాన్యం రైతుల మరణాలకు బాధ్యులెవరు? పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోడీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలి. నిజామాబాద్‌లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారు.విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?భద్రాద్రి రాముడికి రామాయణం సర్క్యూట్‌లో చోటు ఏది?అయోధ్య రాముడు.. భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా? అంటూ రేవంత్ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు.

మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప.. చేతలు చేయడం లేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపవడం అటుంచి వారి పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని విమర్శించారు. బీజేపీ టీఆర్ఎస్ లు 8 ఏళ్లు అంటకాగాయన్నారు. రావాల్సిన పథకాలను తుంగలోకి తొక్కారని ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: