భారత్‌కు రాపిడ్‌ యాంటీబాడీ కిట్లను పంపిన చైనా

భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ వెల్లడి

corona antibody testing kits sending in flight
corona antibody testing kits sending in flight

దిల్లీ: కరోనా వైరస్‌ వెలుగుచూసిన దేశం చైనా ఇపుడిపుడే కోలుకుంటుంది. సుమారు రెండు నెలల లాక్‌డౌన్‌ తరువాత అక్కడ కర్మాగారాలు తెరుచుకున్నాయి. దీంతో కరోనాకు సంబందిచిన కిట్లను తయారు చేసి కొద్దిగా నష్టాలను పూడ్చుకోవాలని భావిస్తుంది. తాజాగా చైనా భారత్‌కు 6.5 లక్షల కరోనా మెడికల్‌ కిట్లను పంపించింది. ఇందులో రాపిడ్‌ యాంటిబాడీ టెస్టింగ్‌ కిట్లు, ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్సన్‌ కిట్లు ఉన్నాయి. మరో 15 రోజలులలో 2 మిలియన్‌ల టెస్టింగ్‌ కిట్లను చైనా భారత్‌కు పంపనుందని బీజింగ్‌లోని భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/