రానున్న నాలుగు వారాలు కీలకం
కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక

New Delhi: కరోనా కేసులు పెరగటం ఆందోళన కల్గిస్తోంది. ఇదిలావుండగా రానున్న నాలుగు వారాలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కట్టడి అత్యంత కీలకమని వెల్లడించింది. కరోనా నిబంధనలు పాటించడంలో పెరిగిన నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారి తీసిందని పేర్కొంది. ఈమేరకు కరోనా వ్యాప్తిపై సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్తో కలిసి నీతిఅయోగ్ సభ్యుడు, ప్రొఫెసర్ వినోద్ పాల్మీడియా ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. అయితే దేశంలో వ్యాక్సిన్లకు లోటు లేదని అందరూ మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/