హైదరాబాద్ లో కేంద్ర బృందం, నేడు ఎక్కడ…?

హైదరాబాద్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ బృందం పర్యటిస్తుంది. రెండో రోజు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ అంచనా వేస్తున్నారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వం లో, కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కె కుష్వారా లు నగరంలో పర్యటిస్తున్నారు.

Full lockdown in Hyderabad for 2 weeks!
Full lockdown in Hyderabad for 2 weeks!

నాగోల్, బండ్లగూడ చెరువుల నుండి ఓవర్ ఫ్లో అయి నాలాలులోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తున్నారు. ఎల్బీ నగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ లో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. మరో బృందం మరో ప్రాంతంలో పర్యటిస్తుంది.