మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ

భారతదేశానికి మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీ లోని రాజ్​భవన్​ వద్ద మోడీ కాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఓవరాల్ గా 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు అయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుండి టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , నాగబాబు , బండి సంజయ్ , కిషన్ రెడ్డి పలువురు హాజరయ్యారు. ఇక భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ నేతలు, అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోడీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.