ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు – సజ్జల

ఏపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది. టీడీపీవిజయం సాధించడం తో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని… పీడీఎఫ్, వామపక్ష పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్లాయని సజ్జల తెలిపారు. ఈ ఫలితాలు ఏ రకంగానూ ప్రభావం చూపబోవని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని భావించలేమని సజ్జల స్పష్టం చేశారు. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదమన్నారు.

మా అభ్యర్థి కౌంటింగ్‌ అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగింది. టీడీపీ వ్యవస్థలను ఎలా మేనేజ్‌ చేయాలో అలవాటు పడింది. ఆ అలవాటు పోవడం లేదు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికలకు సంబంధించి..సహాజంగానే కమ్యూనిస్టులు, అసోసియేషన్లు పోటీ చేస్తుంటాయి. ప్రధాన పార్టీలు మద్దతుగా ఉంటాయి. చిన్న సెగ్మెంట్‌ కావడంతో రెండు స్థానాల్లో వెనుకబడ్డాం. దీన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో దీనిపై కూడా దృష్టి పెడతామన్నారు.