మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపింది గీత ఆర్ట్స్ సంస్థ. ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా ను రీ రిలీజ్ చేస్తున్నట్లు గీత ఆర్ట్స్ తెలిపింది. ఈ ప్రకటన తో ఎప్పుడెప్పుడు ఆ సినిమాను చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వారికీ షాక్ ఇచ్చింది గీత ఆర్ట్స్. పలు సాంకేతిక సమస్యల కారణంగా ఈ చిత్రాన్ని చరణ్ పుట్టిన రోజున రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. అంతేకాకుండా మరో మంచి సందర్భం చూసుకొని ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది.

మరోవైపు చరణ్ పుట్టిన రోజు నాడు ఆరెంజ్ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఆరెంజ్ సినిమాను మార్చి 27వ తేదీన రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించగా.. మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.