వెరైటీ వంటకాలు : నిప్పట్టు

రుచి : నోరూరుంచే వంటకాలు

Variety dishes-Nippattu

పల్లీలు , సెనగ పప్పు -అర కప్పు, బియ్యం పిండి -2 కప్పులు, మైదా పిండి- అర కప్పు, ఉప్మా రవ్వ – పావు కప్పు, వేడి నూనె – 3 టేబుల్ స్పూన్లు, కారం , ఉప్పు, జీల కర్ర – చెంచా చొప్పున, నువ్వులు – 2 చెంచాలు, కరివేపాకు -2 రెబ్బలు, ఇంగువ – చిటికెడు, నూనె – తగినంత ..

ముణుడిగా పల్లీలు , శనగ పప్పులను వేయించి , చల్లారాక కచ్చా పచ్చా దంచుకోవాలి,. ఆ పొడిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, బియ్యంపిండి, మైదా పిండి, రవ్వ , కొన్ని నీళ్లు , కారం, నువ్వులు , జీలకర్ర , తుంచిన కరివేపాకు, ఇంగువ , ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత వేడి నూనె వేసి మళ్లీ కలపాలి.. మెత్తగా , చేతికి అంటుకోకుండా తయారైన మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని పాలిథీన్ పేపర్ మీద ఒత్తుకోవాలి. అన్నీ ఒకే మందంలో సైజులో ఉండేలా చూడాలి. నూనె కాగిన తర్వాత, నిప్పట్లను రెండు వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. ఆంతే .. నిప్పట్టు రెడీ …

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/telangana/