తప్పుల్ని తెలుసుకోవాలి

women

తన కోసం తాను బ్రతికే బ్రతుకు ఎడారిలో ఇసుక రేణువులాంటిది. పదిమంది కోసం పాటు పడే బ్రతుకు హిమాయల శిఖరం కంటే ఉన్నతమైనది. మనం జీవిస్తూ మన చుట్టూ ఉన్న వారి జీవితాలలో కొంత వెలుగు నింపాలి. సంస్కృతి, సంప్రదాయం అలవరుచుకున్న వారి జీవితం ఉత్తమ జీవనంగా సాగుతుంది. సమాజానికి మనం ఎంత ప్రేమ పంచుతామో అంతకు వందరెట్ల ప్రేమను తిరిగి పొందగలము. భయపడుతూ బతికేవారికి ఆపదలు ఎదురవుతుంటాయి. బతికితే నలుగు మెచ్చేలా, చనిపోతే నలుగురు వచ్చేలా బతకాలి. మంచి బుద్ధుల చేత,
మాటల చేత, నడవడిక చేత మాత్రమే మంచిని పొందగలం, మంచిని పెంచగలం. ఏ పనిలోను స్వార్ధ చింతన ఉండరాదు. స్వార్ధ

చింతన లేనప్పుడు మంచి కార్యాలు సాధించగలం. సుఖంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి చాలా తేడా ఉంటుంది. భాగ్యంలో మేలైన వాటిని ఆశించాలి. దురదృష్టంలో మేలైన వాటిని మెచ్చుకోవాలి. సంతృప్తి సహజమైన సంపద. విలాసం కృత్రిమమైన బీదరికం. అన్ని ఔషధాలలోకి ఉత్తమమైనది విశ్రాంతి, ఉపవాసం. అధికంగా మాట్లాడినా, హద్దులు మీరి మాట్లాడినా ప్రశాంతతను కోల్పోతాము. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతాము. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతాము. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తాము. అహంకారం ప్రదర్శిస్తే సరైన మిత్రులుండరు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. కోరికలను, ఆశలను తగ్గించుకోవాలి. ఆశయాలను పెంచుకోవాలి. ఆవేశం గొప్పతనాన్ని, తెలివిని క్షీణింపచేస్తుంది. ఆలోచనలను పెంచుకుంటే బలం పెరుగుతుంది. ధైర్యంగా ఉండాలి. తెగించి ఎదుర్కొనలేకపోవటానికి కారణం పరిస్థితులు కఠినంగా ఉండటం కాదు. అవి కఠినంగా ఉంటాయని భావించి మనం సాహసించ కపోవడమన్నది గమనించాలి. ఆరోగ్య సంపద, బలం, దయ, సహనం, ఉదారగుణం, ప్రేమ, నమ్మకం ఆశ సంతృప్తికరమైన జీవితానికి సూత్రాలు. అసూయ, అసహనం, ఆగ్రహం జీవితానికి శత్రువుల్లాంటివి. వాటిని దగ్గరకు రానివ్వకూడదు. ఆత్మస్థయిర్యం కోల్పోకూడదు. చెడు జరిగినప్పుడు ముందున్నవి మంచి రోజులే అనుకోవాలి. ధైర్యంగా ముందుడుగు వేయాలి. మనల్ని పొగిడే మనుషుల్ని మరవద్దు. అదేవిధంగా మనకి చేయూతనిచ్చిన వారిని కూడా మరిచిపోవద్దు. సాయపడిన వారిని ఎన్నటికీ మరవద్దు. ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నమ్మినవారిని మోసం చేయవద్దు. మనం తప్పులను మనం తెలుసుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది. మితాహారం శరీరానికి మంచిది. మితభాష మనసుకు మంచిది. ఎప్పుడూ ఇతరులతో కలిసి ఉండాలి. కాని వారిని చూసి నవ్వకూడదు. మనమీద నింద వస్తే సరిదిద్దుకోవాలి. అబద్ధమయితే నవ్వి ఊరు కోవాలి. ప్రశాంతను అలవరచు కోవాలి. శాంతి లేకుండా విశ్రాంతి ఉండదు. ఇటువంటి మంచి లక్షణాలు అలవరచుకుంటే మనమంటే ఇష్టపడే వారే ఎక్కువ్ఞంటారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/