నేడు స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట లలో రేవంత్ పర్యటన

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తన దూకుడు ను చూపిస్తున్నారు. అధికార పార్టీ కి ఏమాత్రం తీసిపోని రీతిలో అన్ని తానై చూసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో పర్యటించిన రేవంత్..ఈరోజు స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

నేటి ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే, మధ్యాహ్నం 1 గంటకు వర్ధన్నపేట బహిరంగ సభతో పాటు సాయంత్రం 4 గంటల నుంచి కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈసారి రేవంత్ కొడంగల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫై ఆసక్తి నెలకొని ఉంది.