విజయవంతమైన పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం

సూళ్లూరుపేటః ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్టిట్లోకి వాటిని పంపారు. 960 కేజీల ఓషన్ శాట్-6తో పాటు మరో 8 నానో శాటిలైట్లు ఇందులో ఉన్నాయి. భూటాన్‌కు చెందిన ఓ శాటిలైట్ ‘భూటాన్ శాట్’ కూడా ఇందులో ఉంది.
శుక్రవారం ఉదయం 10:26 గంటలకు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అర్ముగం రాజరాజన్ కౌంట్ డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రమే రాకెట్ లోని నాల్గో దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత అన్ని పరీక్షలు నిర్వహించారు. రాత్రి 10 గంటల తర్వాత రాకెట్ రెండో దశకు అవసరమైన లిక్విడ్ ప్యూయెల్ నింపారు. దాదాపు 25గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 11 :56 గంటలకు ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ను నింగిలోకి పంపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/