ఈరోజు కేసీఆర్ ప్రచారం ఎక్కడంటే

cm kcr

గులాబీ బాస్ కేసీఆర్ తన వయసును సైతం ఏమాత్రం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన దూకుడు ను కనపరుస్తున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ ల పేరుతో అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ వస్తున్నాడు. పదేళ్ల బిఆర్ఎస్ అభివృద్ధి…సంక్షేమ పధకాలు , 24 గంటల కరెంట్ ఇలా అన్ని ప్రజలకు వివరిస్తూ..మరోసారి బిఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలని కోరుతూ వస్తున్నాడు. ఇదే క్రమంలో కాంగ్రెస్ , బిజెపి లపై విమర్శలు చేస్తూ చెమటలు పట్టిస్తున్నారు.

నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలంతో పాటు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. మొత్తంగా 16 రోజుల పాటు కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో గులాబీ బాస్ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇక ఈరోజు పాలకుర్తి, నాగార్జున సాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో తన ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముగిస్తారు. అంతకుముందు మొదటి విడత ప్రచారంలో దాదాపు 74 నియోజకవర్గాలలో ఆయన ప్రచారం చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి సింగిల్ గానే కేసీఆర్ ప్రచారాలు చేస్తున్నారు.