వికారాబాద్ జిల్లాలో ఎక్కువైనా పులుల సంచారం..

వికారాబాద్ జిల్లాలో పులుల సంచారం ఎక్కువ కావడంతో జిల్లా వాసులు బిక్కుమంటున్నారు. నిన్న (సోమవారం) రాత్రి చీలాపూర్‌లో పులులు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెపుతున్నారు. చీలాపూర్ గ్రామానికి చెందిన వడ్డె ఆంజనేయులు మరో ఇద్దరితో కలిసి రాత్రి పొలం దగ్గర కట్టిన పశువులకు మేత వేసేందుకు వేసేందుకు వెళ్తుండగా… దారి మధ్యలో ఓ వ్యవసాయ క్షేత్రం నుంచి ఓ పులి పొలాల వైపుగా పరుగులు తీసినట్లు వారు తెలిపారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అయితే, చీలాపూర్ గ్రామం గుట్ట ప్రదేశంలో ఉండటంతో రాత్రి వేళ ఇళ్ల మధ్యకు పులి వచ్చేందుకు ఆస్కారం ఉందని ఎవరూ బయటకు రావొద్దని గ్రామ సర్పంచ్ రాములు హెచ్చరించారు. దీంతో అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు.

వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనంతగిరి, దామగుండం అటవీ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఇక, పూడూర్‌ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మగపులి, అనంతగిరిలో ఆడవిలో ఆడపులి సంచరిస్తుందని పాదముద్రల ఆధారంగా గుర్తించారు. అధికారులు హెచ్చరికలతో సరిపెట్టకుండా ఎలాంటి ప్రాణహాని జరగకముందే పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.