ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి..తలసాని

ఉజ్జయని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లపై మంతి తలసాని వ్యాఖ్యలు

minister-talasani-srinivas-yadav

హైదరాబాద్‌: ఆదివారం నుండి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ చరిత్రలో మొదటిసారిగా భక్తులు లేకుండా బోనాల వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరు ఇళ్లలోనే ఉంటూ బోనాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా బయటకు వచ్చి భక్తులు ఇబ్బందులు పడొద్దని సూచించారు. అధికారులు, అర్చకుల సమక్షంలో ఆలయంలోనే బోనాల జాతర నిర్వహస్తాం అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/