‘గ్రేటర్’ లో కాంగ్రెస్ ఢీలా !

రెండు చోట్ల మాత్రమే గెలుపు


Hyderabad: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలలో హస్తానికి ఘోర పరాభావం ఎదురైంది. ప్రజలు నాయకులను దారుణంగా తిరస్కరించారు.

సుదీర్ఘచరిత్ర ఉన్న కాంగ్రెస్‌పార్టీకి కష్టాలు తప్పడం లేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీకి తిరస్కరణ తప్పలేదు. గ్రేటర్‌ఫలితాలలో హస్తపార్టీ కనీసం ప్రభావం చూపించలేక పోయింది. కేవలం రెండుస్థానాల్లో మాత్రమే గెలిచింది.

ఈపార్టీ ఎంపి రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు చూపించలేదు. పలు డివి జన్‌లలో కొంతమేరకు ఓటు రాబట్టగలిగారు. టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్యాయం అంటూ గొప్పగా చెప్పుకున్నప్పటికీ వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా వెలువడ్డాయి.

ఒకప్పుడు గ్రేటర్‌ మేయర్‌ హస్తగతంగా ఉండేది, కానీ ప్రస్తుతం పరువుతీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇటీవల దుబ్బాక ఫలితాలలో ప్రభావం చూపించలేక డిపాజిట్‌కూడా దక్కలేదు. తాజాగా జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అదే పరిస్థితి కొనసాగిందని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఇచ్చామని ఎంత ప్రచారం చేసిన్పటికీ ఫలితం మాత్రం చూపడం లేదు. తెలంగాణ ఏర్పడినప్పటికీ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి పరాభావాలు చవిచూస్తేనే ఉన్నాయి. 2018 సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచూపలేదు. తాజాగా 2020 గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో డీలా పడింది.

2009 సంవత్సరంలో జిహెచ్‌ఎంసి ఎన్నికలలో 149 డివిజన్‌లలో పోటీ చేసి 53 స్థానాలు గెలిచారు. అప్పుడు ఎంఐ ఎంతో పొత్తుపెట్టుకున్నారు. ఆతరువాత 2016లో జరిగిన ఎన్నికలలో కేవలం పటాన్‌చెరువు, నాచారం స్థానాలలో గెలుపొందగా, తాజాగా 146చోట్ల అభ్యర్ధులు రంగంలోకిదిగగా రెండు స్థానా లకు పరిమితం అయింది.

ఏఎస్‌రావునగర్‌, ఉప్పల్‌ డివిజన్‌లలో విజయ సాధించారు. టిఆర్‌ఎస్‌కు తాము గట్టిపోటీ అన్న కాంగ్రెస్‌ నేతలు రెండు అంకెలు రాలేదు.

కాగా జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. గెలిచేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి పరాభవం తప్పలేదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/