టీడీపీకి అప్పుడు మీము సపోర్ట్ చేసాం..ఇప్పుడు వారు సపోర్ట్ చేస్తున్నారు – రేణుక

గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి మీము సపోర్ట్ చేసాం…ఇప్పుడు వారు మాకు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు ఖమ్మం మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత రేణుక చౌదరి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా తో మాట్లాడిన ఆమె..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 కి 10 సీట్లు సాదించబోతుందని , రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు 80 సీట్ల తో అఖండ విజయం సాదించబోతున్నట్లు తెలిపారు.

రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు, 18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హాక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని అన్నారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు.