రాహుల్ వరంగల్ సభ ఫై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వరంగల్ లో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభ సక్సెస్ కావడం పట్ల కాంగ్రెస్ నేతలు సంతోషం గా ఉన్నారు. కాగా ఈ సభపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

శుక్రవారం రాత్రి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో స్పష్టం చేయాలని, ఏఐసీసీ ప్రతినిధిగానా? పీసీసీ ప్రతినిధిగా మాట్లాడారా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారినపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు. రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు.

ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన మాట్లాడారో చెప్పాలన్నారు. ఆ డిక్లరేషన్ ఏఐసీసీదా… పీసీసీదా? దేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అవలంబిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం అంటూ ఒకటి ఉందా? పూటకో మాదిరిగా ఊరికో మాదిరిగా మాట్లాడతారా? ఏ ఐసీసీ, పీసీసీలు తయారు చేసిన డిక్లరేషన్ కాదు. డిక్లరేషన్ ఇచ్చే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు.