కాంటినెంటల్ కాన్సర్ సెంటర్ ప్రపంచ రికార్డు సర్జరీ

Continental Cancer Center world record surgery

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన మొదటి హాస్పిటల్ కాంటినెంటల్ కాన్సర్ సెంటర్ డాక్టర్స్ టీమ్ కు నా అభినందనలు ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ.. నేటికి కొన్ని మొండి జబ్బులకు మనం వైద్యం అందించలేకపోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీతో సరికొత్త చరిత్రలు రాస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఇంకా మనం పరిణతి సాధించలేదనే చెప్పాలి. అలా అని చెప్పి సంప్రదాయ పద్ధతి వైద్యం దగ్గరే ఆగిపోలేదు. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఒక కొత్త పరిశోధనాత్మక ప్రక్రియ జరుగుతూనే ఉంది. మానవాళిని అది మరింత ముందుకు తీసుకుపోవడానికి దోహదపడుతూనే ఉంది. ఆ బాటలోనే ఇవ్వాళ మన కాంటినెంటల్ హాస్పిటల్స్ కాన్సర్ సెంటర్ లో జరిగిన ఈ సరికొత్త కాన్సర్ చికిత్స. భవిష్యత్ లో కాన్సర్ ట్రీట్ మెంట్ లో రాబోతున్న విప్లవాత్మక మార్పులకు శ్రీకారం అని చెప్పొచ్చు. వైద్యరంగంలో రోజు రోజుకు ప్రపంచదేశాలకు ధీటుగా ఎదుగుతున్న మన హైద్రాబాద్ లో, ఇలాంటి ఒక సరికొత్త డెండ్రిటిక్ సెల్ థెరపీ జరగడం, అదీ మా కాంటినెంటల్ టీమ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.

కేస్ స్టడీ :

ఒక యువతి అరుదైన, కఠినమైన మెదడు క్యాన్సర్ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతోంది. ఎన్నిరకాలుగా వైద్యం అందించినా.. ఆ వ్యాధి మళ్ళీ మళ్ళీ తిరగబెడ్తూ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ సమయంలోనే ఆ యువతి హైద్రాబాద్ లోని మా కాంటినెంటల్ హాస్పిటల్స్ ను సంప్రదించింది.

ఆ యువతి వ్యాధిని లోతుగా పరిశీలించిన మా కాంటినెంటల్ కాన్సర్ సెంటర్ డాక్టర్ల బృందం.. ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఆ యువతి జన్యుపరివర్తనలో వచ్చిన మార్పుల వల్ల, ఈ విధమైన మెదడు కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులకు, ఇతర కుటుంబసభ్యులకు వివరించారు. అలాగే దీనికి చికిత్స చేసే తీరును కూడా క్షుణ్ణంగా తెలిపారు.

విద్యావంతులైన ఆ తల్లిదండ్రులు ఈ -డెన్ట్రిటిక్ సెల్ థెరపీ” అనే సరికొత్త చికిత్స విధానానికి అంగీకరించి, అన్నిరకాల సహకరించారు. అందుకు వాళ్ళకు మనం ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే.. బహుశా ఈ తరహా వైద్య విధానానికి, మనదగ్గర… వాళ్ళే మొదటివాళ్ళు.

డెన్ట్రిటిక్ సెల్ థెరపీ ద్వారా… యువతి యొక్క రోగనిరోధక కణాలను, అలాగే యువతిలోని కాన్సర్ సోకిన కణాలను తీసుకుని, రెగ్యులేటరీ ఆమోదించిన పద్ధతిలో వాటినుంచి ఒక వాక్సిన్ ను తయారుచేశాము. అలా తయారుచేసిన వాక్సిన్ ను, ఆ యువతి చర్మానికి ఇంజక్ట్ చేసాము. మేము ఊహించినట్టే ఆ వాక్సిన్ మంచి ఫలితాలను చూపెట్టింది.

ఇట్లాంటి అరుదైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తులకు, ఇలా డెన్ట్రిటిక్ సెల్ థెరపీ ద్వారా ట్రీట్ మెంట్ చేసిన వాళ్ళలో.. బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో మా కాంటినెంటల్ హాస్పిటల్స్ నే మొదటిది. ఈ కఠినమైన మెదడు కాన్సర్ వ్యాధికి ఒక్కోసారి సంప్రదాయ చికిత్సా పద్ధతులు పనిచేయకపోవచ్చు. అప్పుడు ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్ మెంట్స్ తో బ్రెయిన్ ట్యూమర్స్ ను అరికట్టవచ్చును.డెండ్రిటిక్ సెల్ థెరపీ అంటే.. కాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఆ కాన్సర్ కణతులను టార్గెట్ చేసుకుని, ఒక నిర్దిష్ట రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేసే నావెల్ ట్రీట్ మెంట్ స్ట్రాటెజీ అని చెప్పాలి.

ఈ ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చు అవుతుంది ?

ఈ నిర్దిష్ట చికిత్సకు అమెరికాలో అయ్యే ఖర్చు అక్షరాల 4 కోట్ల రూపాయలు. ప్రత్యేకించి ఇండియాలో మా కాంటినెంటల్ హాస్పిటల్స్ లో… పెద్దప్రేగు, అండాశయం, ప్రోస్టేట్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్. అలాగే ఇతర కఠినమైన కాన్సర్ కణితులకు 6 నుండి 8 లక్షల లోపునే ఈ లైఫ్-సేవింగ్ థెరపీని అందిస్తున్నాము.

డెండ్రిటిక్ సెల్స్ ఎలా పనిచేస్తాయి ?

కాన్సర్ కి వ్యతిరేకంగా ఈ డెండ్రిటిక్ సెల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వివిధ రకాల స్ట్రాటెజీస్ ద్వారా ఉత్పత్తి అయిన ఈ యాంటిట్యూమర్ రోగనిరోధక శక్తి.. కాన్సర్ కణితులను పూర్తిగా క్షీణింప చేస్తాయి.

డెండ్రిటిక్ సెల్ వాక్సిన్ సురక్షితమేనా ?

ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం… డెండ్రిటిక్ సెల్ వాక్సిన్ వందశాతం సురక్షితమైనది. అలాగే రోగుల్లో రోగనిరోధక సామర్థ్యాన్ని పెంపొందించడంలో పూర్తిగా విజయవంతమైనది.

డెండ్రిటిక్ సెల్ థెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ?

ఈ థెరపీ ద్వారా వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్… అలసట. ఈ థెరపీ ప్రయోగం చేసిన వాళ్ళలో 11శాతం మంది అలసటగా ఉన్నట్టు గుర్తించారు. ఇది తప్పిస్తే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఈ విధానం లో లేవు. అందుకే ఈ డెండ్రిటిక్ సెల్ వాక్సిన్ అనేది మెదడు కణితులకు సురక్షితమైన చికిత్సగా చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ఎక్కడైనా ఉపయోగించారా ?

2010లో డెండ్రియాన్స్ ప్రావెంజ్ లో ప్రొస్టేట్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా ఈ డెండ్రిటిక్ సెల్ వాక్సిన్ ను ఉపయోగించారు. దీన్ని US FDA అప్రూవ్ చేసింది.

డెండ్రిక్ సెల్ వాక్సిన్ కు ఆమోదం ఉందా? ఒకవేళ ఉంటే ఇది ఇప్పుడు అందుబాటులోనే ఉందా ?

ఈ వాక్సిన్ కు ఆమోదం ఉంది. అలాగే డెండ్రిటిక్ సెల్ థెరపీ భారతదేశంలో APAC బయోటెక్ ద్వారా అందుబాటులో ఉంది. నిజానికి 2014లో సుమారుగా 40 సబ్జెక్టులలో ట్రయల్ చేసిన వారిలో నేను మొదటి వ్యక్తిని, స్థిరమైన మెరుగుదలతో ఆలస్యంగా ఆమోదించబడిన Apac CDSCO (భారతీయ FDA) నుండి ఆమోదం పొందింది.