కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫై విరుచుకుపడ్డ కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఫై మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకుముందు కూడా రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏం చేశారు? అని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణం అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నల్లగొండ నియోజకవర్గం, పట్టణం అభివృద్ధి చెందాయని అన్నారు. కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్గొండ ఎలా ఉంది? మంచి నీళ్ళు వచ్చాయా? కరెంట్ మాటేమిటి? అసలు ఏ పనులైనా చేశాడా? మరి అదే నల్గొండ ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు.
బీఆర్‌ఎస్ వచ్చాక రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు అయ్యింది. భవిష్యత్‌లో దాన్ని రూ.5 వేలకు పెంచుతాం .ఆరోగ్యం విషయంలో మేం ఎన్ని చర్యలు తీసుకున్నమో మీరు చూస్తున్నరు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో పాత నల్లగొండ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ రాలే. ఇయ్యాల మూడు మెడికల్ కాలేజీలు వచ్చినయ్. నల్లగొండలో ఐదారు వందల బెడ్లతోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చింది. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్నం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.