వరుణ్ తేజ్ కు బెస్ట్ విషెష్ అందజేసిన రేణు దేశాయ్

వరుణ్‌ తేజ్‌ (Varun Tej) , లావణ్య (Lavanya Tripathi)ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం రేపు (నవంబరు 1న) ఇటలీలో జరగనుంది. మూడు రోజులుగా అక్కడ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్‌, లావణ్యల కుటుంబాలు, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఉపాసన, అల్లు అర్జున్ తదితరులు పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక నవంబర్‌ 5న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

కాగా ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి సైతం ఆహ్వానం అందిందట. కాకపోతే తాను ఆ వివాహ వేడుకకు హాజరైతే అందరూ అసౌకర్యంగా ఫీలవుతారని, అందుకే వెళ్లడంలేదని చెప్పుకొచ్చింది. తాను నిహారిక పెళ్ళికి కూడా వెళ్లలేదని.. పిల్లల్ని మాత్రం పంపించానని చెప్పుకొచ్చింది. వరుణ్ చిన్నప్పుడు నా కళ్ళ ముందే పెరిగాడు.. తనకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని.. తాను పెళ్ళికి వెళితే అందరికీ కాస్త అన్ కంఫర్టబుల్‌గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సారి ఇటలీలో జరగబోయే వరుణ్, లావణ్య పెళ్ళికి అకీరా, ఆద్య వెళ్ళనట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రేణుదేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారు.