స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

bail-for-chandrababu-naidu

అమరావతి: స్కిల్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. టిడిపి అధినేత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు.. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.