‘మేం సేఫ్ గా ఉంటే చాలనుకునే రకాలు’.. వాళ్ళు

చంద్రబాబు, లోకేష్ లపై విజయసాయిరెడ్డి ట్వీట్

Vijayasaireddy tweets about Chandrababu and Lokesh
Vijayasaireddy tweets about Chandrababu and Lokesh

దేశ ప్రజలు అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే, చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ మాత్రం స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని వేయించుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. “దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని తండ్రి కొడుకులు వేయించుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీల్లో ఫోటోలు కనిపించక పోయేటప్పటికి అనుమానాలు బలపడుతున్నాయి. మేం సేఫ్ గా ఉంటే చాలనుకునే రకాలు కదా! ” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/