తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్​ఆర్టీసీ శుభవార్త

బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయం
టీటీడీతో ఒప్పందం చేసుకున్న టీఎస్ఆర్టీసీ
నేటి నుంచే అమల్లోకి వస్తుందన్న సజ్జనార్

telangana-rtc-has-made-available-the-facility-of-booking-ticket-for-tirumala-darshan-along-with-bus-ticket

హైదరాబాద్ : తెలంగాణ నుంచి తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుపతి వెళ్లే బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకుంది. నేటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

ప్రతి రోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుమలకు బస్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా కానీ, లేదంటే అధీకృత డీలర్ వద్ద నుంచి కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్న సజ్జనార్ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌ లేదా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో ప్యాకేజీ కోసం కనీసం వారం ముందుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/