శేరిలింగం పరిధిలో పలు కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఎత్తివేత

గత కొద్ది రోజులుగా నమోదు కాని కరోనా కేసులు

contain ment zone
contain ment zone

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఈ ఏరియాల్లొ ఉన్న కంటైన్‌ మెంట్‌ జోన్లను అధికారులు తొలగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శేరిలింగంపల్లి పరిదిలో ఉన్న 21 కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఆరింటిలో కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో అధికారులు ఆ ప్రాంతాలలో కంటైన్‌మెంట్‌ జోన్‌లను తొలగించారు. ఇందులో సాయినగర్‌, మధీనా గూడా, అయ్యప్పసొసైటి, అంబెద్కర్‌ నగర్‌, సితార హోటల్‌(మియాపూర్‌), సిష్ట హోటల్‌(కొండాపూర్‌) ఏరియాల్లో కంటైన్‌మెంట్‌ జోన్‌లను తొలగిస్తున్నట్లు అధికారుల ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/