బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ ప్రకంపనలు

ఇప్పటివరకు 3600 మంది మృతి..52,995 చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

brazil coronavirus
brazil coronavirus

బ్రెజిల్‌ : కరోనా మహమ్మారి బ్రెజిల్‌ను అతలాకుతలం చేస్తుంది. వేల సంఖ్యలో కేసులు వస్తుండడంతో అక్కడి ఆసుపత్రులు స్థాయికి మించి సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కొత్త కేసులను చేర్చుకోలేమంటూ ఆసుపత్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని నగరం రియో డి జనీరోలో ఏ ఆసుపత్రి చూసినా కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇతర నగరాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. కాగా ప్రస్తుతం బ్రెజిల్‌లో నమోదైన అధికారిక కేసుల సంఖ్య 52,995 కాగా, మృతుల సంఖ్య 3600కు చేరింది. మరోవైపు శ్మశాన వాటికలు సైతం కరోనా మృతుల తాకిడి ఎదుర్కొంటున్నాయి. మానాస్ సిటీలో భారీ గోతులు తీసి వాటిలో సామూహిక ఖననం చేస్తున్నారు. అయితే బ్రెజిల్‌ పరిస్థితిలు ఇలా ఉంటే అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో మాత్రం భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, ముప్పు ఉన్నవారిని ఐసోలేషన్ చేస్తే సరిపోతుందనిఅంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/