శ్రీకాకుళం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

నిన్నటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదు కాని కేసులు

corona virus
corona virus

శ్రీకాకుళం: ఏపిలో కరోనా మహమ్మారి విలయతండవం చేస్తుంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు కరోనా ఉత్తరాంధ్రను కూడా తాకింది. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర వాసుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. ఈ కేసుల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/