మరోసారి తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేసిన పోలీసులు

teenmaar-mallanna

బ్లాక్ మెయిల్ చేశారనే పిర్యాదు ఫై అరెస్ట్ అయినా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చంచలగూడ నుండి బెయిల్ ఫై బయటకొచ్చారు. ఆలా బయటకు వచ్చారో లేదో మరోసారి మల్లన్న ను పోలీసులు అరెస్ట్ చేసారు.

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన మల్లన్నను అక్కడే కాపుకాసిన ఎడపల్లి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రూ.20లక్షలు ఇవ్వాలంటూ మల్లన్నతోపాటు మరికొందరు వ్యక్తులు తనను బెదిరించారని.. ఎడపల్లికి చెందిన కల్లు వ్యాపారి జయవర్ధన్‌ గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్‌ రంగంలోకి దిగి తీన్మార్‌ టీం సభ్యులు ఉప్పు సంతోష్‌, రాజాగౌడ్‌, సాయాగౌడ్‌, రాధాకిషన్‌ను ఇటీవలే అరెస్టు చేశారు. నిన్న రాత్రి మల్లన్న ను కోర్టులో హాజరు పర్చారు. కాగా మల్లన్న కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తీన్మార్‌ మల్లన్న కేసు విషయంలో సీఎస్‌, డీజీపీ స్వయంగా విచారణకు హాజరు కావాలని జాతీయ బీసీ కమిషన్‌(ఎన్సీబీసీ) సభ్యుడు తల్లోజు ఆచారి ఆదేశాలు జారీ చేశారు.