స్ట్రెచ్ మార్క్స్ తగ్గాలంటే…

మహిళలు – ఆరోగ్య సమస్యలు – పరిష్కారం

Reduce stretch marks

గర్భం దాల్చిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ అవటం సహజం. అధిక బరువు ఉన్న మహిళల్లోనూ ఇవి కనిపిస్తాయి. చర్మం సాగిపోవటం కారణంగా ఏర్పడే వీటినై తగ్గించుకోవటానికి మహిళలు చాలానే శ్రమ పడుతుంటారు. . మరి వీటిని తగ్గించుకొనే అవకాశం ఉందా తెలుసుకుందాం ..

పొట్టపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించుకోవటానికి కొన్ని సహజమైన పద్దతులను పాటించటం ద్వారా కూడా కొంత వరకు ప్రయోజనం పొందవచ్చు.

నిమ్మ రసం లో కొద్దిగా పంచదార , కొన్ని చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని పొట్టపై రాసి కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మ కణాలకు రక్త ప్రసరణ జరిగి స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాను ప్రతిరోజూ పాటించటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

కలబంద సైతం మార్క్స్ ను తగ్గించటానికి సాయం చేస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జుని చర్మానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటీతో కడిగేయాలి. . ఇలా రోజూ చేయటం ద్వారా చర్మం పై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది.

కొద్దిగా ఆముదంతో పొట్ట బాఘాన్ని 5 నుంచి 10 నిముషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పలుచని కాటన్ వస్త్రం తో కప్పాలి. ఆపై హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీరు నింపిన వాటర్ బాటిల్ తో పొట్టపై కప్పిన వస్త్రం పై కాపడం పెట్టినట్టుగా చేయాలి. ఇలా క్రమం తప్పకుండ నెల రోజుల పాటు చేస్తే కొంతవరకు ఫలితం కన్పిస్తుంది.

ఆలివ్ నూనెను ఉపయోగించటం ద్వారా కూడా పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ ను దూరం చేసుకోవచ్చు. దీన్ని వేడి చేసి దాంతో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సమయం అలాగే వదిలేయాలి. ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ బాగా జరగటంతో పాటు విటమిన్ ‘ఏ’, ‘డి ‘. ‘ఇ ‘ చర్మంలోకి బాగా ఇంకుతాయి. దీని వల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది.

‘నాడి’ (ఆరోగ్య సంబంధిత విషయాలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/