భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచ ఖ్యాతి
‘దుబాయ్ ఎక్స్‌పో’ను సందర్శించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం దుబాయ్ ఎక్స్‌పో- 2020లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా , ఇండియా పెవిలియన్‌లోని ‘ది గ్లోబల్ రీచ్ ఆఫ్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ’ గురించి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందిన విధానంపై మంత్రి అనురాగ్ మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీకి ఇండియా పెట్టింది పేరని.. విదేశాల్లోనూ భారతీయ సినిమా సత్తా చాటుతోందని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు.
రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. భారతీయ సినిమా సరిహద్దులను చెరిపి వేస్తున్నాయని , ఇతర దేశాల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయని అన్నారు. దేశ విదేశాల్లో భారతీయ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/