నల్లటి వలయాలు తొలగేందుకు..

కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉంటే చక్కని ముఖం చిన్నబోతుంది. ముఖంలో ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇందుకు కారణం సరిపడినంత నిద్ర లేకపోవడం. అలసట, ఒత్తిడి ఇవన్నీ కూడా వలయాలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఇది పోషకాహార లోపమని నిపుణులు అంటున్నారు.

black circles .
black circles .

నల్లటి వలయాలతో పాటు స్తబ్ధుగా ఉండి, నీరసంగా అనిపిస్తుంటే శరీరంలో తగినంత ఇనుము లేదని అర్ధం. దీని వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో చర్మం పాలిపోతుంది.

దాంతో నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. పచ్చని కాయకూగూరలు, గుమ్మడి గింజలు, పప్పులు, బీన్స్‌లో ఇందుకు కావలసినది ఉంటుంది..

విటమిన్‌ సి చర్మ సౌందర్యాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ఒక పండ్లలో జామ, స్ట్రాబెర్రీ, నిమ్మజాతి పండ్లు, కాలీఫ్లవర్‌లలో కూడా ఎక్కువగానే ఉంటుంది.

విటమిన్‌ కె జీవం పోసిన చర్మాన్ని మెరిసేట్లు చేస్తుంది. గాయాలను మాన్పుతుంది. చర్మ సమతౌల్యాన్ని కాపాడుతుంది. రోజూ విటమిన్‌ కె తీసుకోవడం వల్ల నల్లటి వలయాలు త్వరగా చర్మంలో కలిసిపోతాయి. దానిమ్మ, టమాటాలోను ఎక్కువే.

విటమిన్‌ ఇ చర్మం, జుట్టు సంరక్షణకు అవసరమైన అతి ముఖ్యమైన విటమిన్‌. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

చర్మం పొడిబారి పోకుండా చేస్తుంది. పిగ్మేంటేషన్‌ నుంచి కాపాడుతుంది.

వృద్దాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది. సన్‌ఫ్లవర్‌ నూనె, మొక్కజొన్న, బచ్చలి, బాదంపప్పులలోను ఎక్కువగా లభిస్తుంది.

లైకొపిన్‌ వివిధ రకాల పండ్లు, కూరగాయాలలో ఉండే రసాయనం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఎక్కువ. కంటి చూపును, వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.

మచ్చలతో పాటు నల్లటి వలయాలను తగ్గిస్తుంది. టమాటా, పుచ్చకాయ, క్యాబేజీ బొప్పాయిలలోను ఎక్కువే లభిస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/