మసాలా పరాటా

MASALA PARATA–

కావలసిన పదార్థాలు

గోధుమపిండి – పావ్ఞకిలో
మైదా – పావ్ఞకిలో
సెనగపప్పు – పావ్ఞకిలో (నానబెట్టాలి)
పాలు – పావ్ఞ లీటరు
అల్లం – చిన్నముక్క
జీలకర్ర – 2 టీ స్పూన్లు
కారం – టీ స్పూను
గరం మసాలా – అర టీ స్పూను
కొత్తిమీర తురుము – పావ్ఞకప్పు
నిమ్మరసం – అరటేబుల్‌ స్పూను
ఉప్పు – తగినంత
నెయ్యి – అరకప్పు
నూనె – తగినంత

తయారుచేయు విధానం
మైదాపిండి, గోధుమపిండి రెండూ బాగా కలపాలి. ఉప్పు, పాలు తగినన్ని నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపాలి.
పిండిముద్ద ఎండిపోకుండా కాస్త నూనె అద్ది, పలుచని మెత్తని తడిబట్టతో కప్పి ఓ అరగంట సేపు నాననివ్వాలి.
సెనగపప్పులో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత నీళ్ల వంపేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
జీలకర్ర, మిరియాలు వేయించి తీయాలి. ఇందులోనే నిమ్మరసం, అల్లం తురుము, కొత్తిమీర కలపాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని సెనగపప్పుపిండిలో కలపాలి. గోధుమపిండిని ముద్దలుగా చేసుకోవాలి. చపాతీలా వత్తి దానిపైన మరో చపాతీ పెట్టి అంచుల్ని మూసేయాలి.
స్టవ్‌మీద పెనం పెట్టి ఒక్కో పరోటాని నూనెగానీ నెయ్యిగానీ వేయకుండా తక్కువ మంటమీద సగం కాల్చాలి.
తరువాత నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. వీటిని వేడి వేడిగా ఏదైనా చట్నీతో లేదా కూరతో తింటే బాగుంటుంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/