తెలంగాణలోని పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ లో ఎండలు ఎండలు నిప్పుల కొలిమిలా మారాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు 46.4 డిగ్రీల కు చేరుకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ము నుగోడు మండలంలో 46.6 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లి మండలం గొడకండ్లలో 39.9 డిగ్రీలు నమోదయ్యాయి.

అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. నిత్యం బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ నగరం కూడా నిర్మానుష్యంగా మారుతుంది. భారీ ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రస్థాయిలో వడగాలులు వీయడం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోతను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. గతంలో ఏ సీజన్ లో లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో పదిహేను జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి-కొత్తగూ డెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, హనుమకొండ, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈనెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది.