తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 న రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగనుంది.

ఈ క్రమంలో ఈసీ పోలింగ్ సమయాన్ని పెంచింది. సాధారణంగా ఉదయం 07 నుండి సాయంత్రం 05 వరకు పోలింగ్ జరగనుండగా..ఇప్పుడు రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 06 గంటల వరకు పొడిగించింది.