ఎన్నిక‌ల ప్ర‌చారానికి సీఎం జగన్ బ్రేక్..

Seventh day Jagan memantha siddham yatra

ఏపీ సీఎం జగన్..ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చాడు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పది రోజుల సమయం మాత్రమే ఉండడం తో బరిలో దిగిన అభ్యర్థులతో సమావేశం అయ్యేందుకు గాను జగన్ ప్రచారానికి బ్రేక్ ఇచ్చాడు. గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. గెలిచే చోట కచ్చితంగా ఫోకస్ పెట్టాలని… వాటిని కైవసం చేసుకునేలా వ్యూహరచనలు చేయాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేయనున్నారు. అందుకే ఈరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

గత కొద్దీ రోజులుగా సీఎం జగన్ సిద్ధం పేరిట భారీ సభలు , మేము సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు యాత్ర పూర్తికాగానే మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని మళ్లీ యాత్ర చేపట్టారు. మరోపక్క కూటమి అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. నెల క్రితం వరకు పెద్దగా ప్రచారం చేయని నేతలు..ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడడంతో బిజీ బిజీగా పర్యటిస్తూ..ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అనేది చూడాలి.