కియారా – సిద్ధార్థ్ లది జెన్యూన్ లవ్ అంటూ కంగనా ట్వీట్

నిత్యం వివాదాస్పద ట్వీట్స్ తో వార్తల్లో నిలిచే కంగనా..తాజాగా కియారా – సిద్ధార్థ్ లది జెన్యూన్ లవ్ అంటూ చెపుతూనే బాలీవుడ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. కియారా అద్వానీ ఓ ఇంటిది అయ్యింది. సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి ఏడు అడుగులు వేసింది. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూరజ్ గడ్ ప్యాలెస్ లో వీరి వివాహం అట్టహాసంగా మంగళవారం రాత్రి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక సినీ ప్రముఖులు , అభిమానులు కియారా – సిద్ధార్థ్ లకు విషెష్ చెపుతూ వస్తున్నారు.

ప్రెస్ రష్మి రాకెట్ స్క్రీన్ రైటర్ అనిరుద్ధ గుహ సైతం సోషల్ మీడియా లో కియారా సిద్ధార్థ్ పెళ్లిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాళ్లు డేటింగ్ లో ఉన్నారా ఇన్ని రోజులు? అని ట్వీట్ చేశారు. దీనిపై కంగనా తనదైన స్టైల్ లో స్పందించింది. అవును వారిద్దరు డేటింగ్ లో ఉన్నారు కానీ అది బ్రాండ్ ప్రమోషన్ లేదా మూవీ ప్రమోషన్స్ కోసమో కాదు ఎవరి దృష్టి తమపై పడాలని కోరుకోలేదు. బాలీవుడ్ లో మిగతా రిలేషన్స్ లాగా ఎటువంటి జిమ్మిక్కులు చేయలేదు. వారిద్దరిదీ ఎంతో గాఢత తో కూడిన జెన్యూన్ లవ్. చూడ ముచ్చటైన జంట అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది.