పిఠాపురంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఒకెత్తు..పిఠాపురం పోలింగ్ ఒకెత్తు..ఎందుకంటే అంతలా పిఠాపురం ఫై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిల్చోవడమే. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారని తెలిసి దగ్గరి నుండి అంత పిఠాపురం గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈసారి చిత్రసీమ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసారు. కొంతమంది సోషల్ మీడియా లో మద్దతు పలికితే..మరికొంత మంది నేరుగా పిఠాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసారు. దీంతో అందరిలో పోలింగ్ ఫై ఆసక్తి మొదలైంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. పిఠాపురం మున్సిపాలిటీతో పాటు.. కొండెవరం, విరవ, విరవాడ, మల్లం, కందరాడ..గొల్లప్రోలు, చేబ్రోలు, చెందుర్తి, వన్నెపూడి..పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ బూతుల ముందు క్యూకట్టిన ప్రజలు అర్థరాత్రి దాటేవరకూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పిఠాపురంలో 84.27 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికల్లో పిఠాపురం ఓటింగ్ శాతం 81.24గా ఉంది. ఈసారి దానిని మించి నమోదవడం విశేషం. ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, యువత అందులోనూ మొదటిసారి ఓటు వేస్తున్న వారు ఉత్సాహంగా ఓటు వేయడం గమనార్హం.