స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు..

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా..ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం లలో ఉంది.

స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఆయా స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్‌ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. ముఖ్యంగా స్ట్రాంగ్‌ రూముల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు.