డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రీట్..

డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రీట్..

ఆర్ఆర్ఆర్ …ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా యావత్ సినీ లోకమే కాదు ప్రజలోకం సైతం ఎదురుచూస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్స్ నటించడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొనింది. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడిన ఈ మూవీ…జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఫై దృష్టి సారించింది. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసి ఆకట్టుకోగా…డిసెంబర్ 09 న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.

నిజానికి డిసెంబర్ 3న ట్రైలర్‌‌‌‌ విడుదల కావాల్సి ఉంది. కానీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 9న ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. థియేటర్స్‌‌లో కూడా ట్రైలర్​ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఇక ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసారు చిత్ర యూనిట్. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో యుద్ద సన్నివేశాలు ఉండటం వల్ల యూ/ ఏ వచ్చిందట. సినిమాలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేసారు. దానయ్య భారీ బడ్జెట్‌‌తో నిర్మించగా..కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.