టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకాలను ఖండించిన పురందేశ్వరి

టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ పురందేశ్వరి మండిపాటు

Purandeswari condemns nominations to TTD Trust Board

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుపై ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. టిడిని బోర్డు అంటే రాజకీయ పునరావాస కేంద్రం అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మరోసారి నిరూపించారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, అవినీతి ఆరోపణలతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో తొలగించబడ్డ కేతన్ దేశాయ్ తదితరులను టిడిపి బోర్డులోకి తీసుకున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతపై జగన్ కు ఏమాత్రం నమ్మకం లేదనే విషయం ఈ నియామకాలతో మరోసారి నిరూపితమయిందని చెప్పారు. ఈ నియామకాలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను షేర్ చేశారు.