ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

scr-special-trains-south-central-railway-extended-16-special-trains

న్యూఢిల్లీః ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నంబర్‌ తిరుపతి – షిర్డీ సాయినగర్‌ (రైలు నంబర్‌ 07637) రైలును సెప్టెంబర్‌ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం నడువనున్నది. అలాగే షిర్డీ సాయినగర్‌ – తిరుపతి (07638) రైలును సెప్టెంబర్‌ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నది. కాజీపేట – దాదర్‌ (07195) రైలు సెప్టెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం పరుగులు తీయనున్నది. దాదర్‌ – కాజీపేట (07195) రైలు ప్రతి శనివారం నడువనుండగా.. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. కాజీపేట – దాదర్‌ (07197) వీక్లీ రైలు సెప్టెంబర్‌ 2-30 వరకు ప్రతి శనివారం నడువనున్నది. అలాగే దాదర్‌ – కాజీపేట (07198) మధ్య ఆదివారం అందుబాటులో ఉండనుండగా.. సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పొడిగించింది.

అలాగే హైదరాబాద్‌ – రక్సౌల్‌ (07051) మధ్య ప్రతి శనివారం రైలు నడువనుండగా.. సెప్టెంబర్‌ 2 నుంచి 30 వరకు, రక్సౌల్‌ – హైదరాబాద్‌ రైలు ప్రతి మంగళవారం సెప్టెంబర్‌ 5-అక్టోబర్‌ 3 వరకు నడువనున్నది. సికింద్రాబాద్‌ – దానాపూర్‌ (07419) మధ్య శనివారం 2 నుంచి 30 వరకు, దానాపూర్‌ – సికింద్రాబాద్‌ (07420) మధ్య ప్రతి సోమవారం సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు రైలు పరుగులు తీయనున్నది. సికింద్రాబాద్‌ – రక్సౌల్‌ (07007) మధ్య ప్రతి బుధవారం 6 నుంచి 27 వరకు.. రక్సౌల్‌ – సికింద్రాబాద్‌ మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్‌ 8 నుంచి 29 వరకు పొడిగించింది. సికింద్రాబాద్‌ – జైపూర్‌ (07115) మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29, జైపూర్ – హైదరాబాద్ (07116) మధ్య ప్రతి ఆదివారం సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 1 వరకు నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే కాచిగూడ – బికనీర్‌ (07053) మధ్య ప్రతి శనివారం సెప్టెంబర్‌ 2 నుంచి సెప్టెంబర్‌ వరకు, బికనీర్-కాచిగూడ (07054) మధ్య ప్రతి మంగళవారం సెప్టెంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 3 వరకు ప్రత్యేక రైలును పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.