ఆరోగ్య పరిరక్షణలో కరివేపాకు

ఆకు కూరలు – పోషకాలు

Benefits of curry leaves
Benefits of curry leaves

కరివేపాకులో ప్రోటీన్లు, కాల్షియమ్, ఐరన్, ఏ, బి, సి విటమిన్ లు ఉంటాయి. ఆరోగ్యం పరిరక్షణలో కరివేపాకు మేలైన ముఖ్య పాత్ర పోషిస్తుంది.. దీని రెమ్మల కషాయం శరీరానికి చలువ చేస్తుంది.. అన్ని వయసుల వారికీ ఇది మంచిది… కరివేపాడు తింటే ఒత్తిడి తగ్గి మెదడుకు క్యాల్షియం సరఫరా చేసి మనసును ఎంతో హాయిగా ఉంచుతుంది.. ఒత్తిడిని తగ్గించటంలో మంచి మిత్రుడి కరివేపాకు… వేవిళ్ళతో బాధపడే గర్భిణీలు కరివేపాకుల రసం తీసుకుని నిమ్మ రసం స్పూన్, తేనె అర స్పూన్ కలిపి తీసుకుంటే తప్పనిసరిగా వేవిళ్లు తగ్గుతాయి..

నోటి పూతతో బాధ పడేవారు పచ్చి కరివేపాకు ఆకులు ప్రతి రోజూ ఉదయాన్నే నమిలితే త్వరలో నోటి పూత తగ్గి పోతుంది.. చక్కెర వ్యాధి గ్రస్తులు ప్రతిరోజూ పరగడుపున కరివేపాకు ఒక రెబ్బ ఆకులు నమలడం మంచిది.. రక్తంలో షుగర్ శాతం తగ్గుతుంది.. చక్కెర వ్యాధిలో ఉండే నీరసం కూడా తగ్గుతుంది.. శక్తిని కల్గిస్తుంది… కరివేపాకు ప్రతి రోజూ తింటే బలహీనత తగ్గి బలవంతులుగా మారతారు.. ప్రతిరోజూ ముసలివారు లేత కరివేపాకు ఆకును ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి…

కరివేపాకు ప్రతి రోజూ క్రమం తప్పకుండ ఆహారంలో తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు తలగిపోతాయి.. దీని చెట్టు వేళ్ళతో కషాయం చేసి ప్రతి రోజూ నెల రోజుల పాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు కరిగి పోతాయి.. నూనెలో కరివేపాకు వేసి, బాగా మరిగించి రోజూ ఆ తైలాన్ని తలకు రాసుకుంటే క్రమ క్రమంగా జుట్టు నల్లబడుతుంది…

కరివేపాకును చారులో వేసుకుని తాగితే విరోచనం సులభం అవుతుంది.. కరివేపాకు ఎక్కువగా తింటే రక్తం పలుచగా మారి గుండెకు ఎంతో మేలు చేస్తుంది… కళ్ల జబ్బులుఅజి కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది.. పంటి జబ్బులకు కూడా కరివేపాకు ఎంతో ప్రయోజనం కల్గిస్తుంది.. పిల్లలకు పాలిచ్చే తల్లులు కరివేపాకు వాడితే తల్లి పాలువృద్ధి అవుతాయి.. కరివేపాకు ప్రతిరోజూ తింటే అజీర్ణం తగ్గుతుంది..

‘స్వస్థ’ (ఆరోగ్య సంబంధిత ) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/