కొలెస్ట్రాల్ నియంత్రణ ఇలా..

ఆహారం – ఆరోగ్యం

Complete health with cholesterol control

కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.. ఆహార, జీవన శైలిలో కొన్ని మార్పులతో కొలెస్ట్రాల్ ను తగ్గించు కోవచ్చు.. అదెలాగంటే..

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవటాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.. ఒక్కరే వ్యాయామం చేయాలంటే బోర్ గా ఫీలవుతారు.. అందుకే స్నేహితులతో కలిసి వెళ్ళాలి.. జిమ్ కు వెళ్ళటం వాయిదా వేయొద్దు.. రాకుకు కనీసం అరగంట పాటు వేగంగా నడవాలి..

స్నేహితులతో కలిసి కాసేపైనా మనసారా నవ్వు కోవాలి.. ఒత్తిడి తగ్గితే గుండెకు చాలా మంచిది.. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి..

సుగర్లు, ఇతర పదార్ధాలు బరువు పెరగటానికి కారణం అవుతాయి.. దీంతో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది.. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.. అలాగే, ప్రాక్టోజ్ తీపి పదార్ధం ఎక్కువగా వుండే పదార్ధాలను తినకూడదు..

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చోసుకోవాలి.. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు రోజూ తినాలి..
వేపుడు పదార్ధాలు తినటం బాగా తగ్గించాలి.. బంగాళా దుంప వేపుడు , చిప్స్ లాంటివి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.. కాబట్టి వాటిని తినకూడదు..

చేపల్లో లభించే డ్రై డ్రాక్సీ ఎసిటోన్ మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.. కాబట్టి వారంలో ఒకరోజు సీ ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోవాలి.. శాఖాహారులు ఫిష్ సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు.

‘నాడి ‘ (ఆరోగ్య సలహాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/