హాస్పటల్ లో సలార్ విలన్..

సలార్ మూవీ లో విలన్ పాత్ర చేస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హాస్పటల్ లో చేరాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మలయాళంలో విలయత్ బుద్ద అనే సినిమా చేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పృథ్వీరాజ్ బిజీ గా ఉన్నాడు. ఆదివారం మూవీ లోని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయన ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఆయనను కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కాలికి దెబ్బ తగలడంతో సోమవారం ఉదయం ఆయనకు ఒక చిన్న ఆపరేషన్ చేయనున్నారట. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ రెండు, మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్ లో హీరోగా పృథ్వీరాజ్ నటించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పృథ్వీరాజ్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో వరదరాజ మన్నార్ గా నటిస్తున్నాడు.