సింగర్ మంగ్లీకి గాయం..

ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురైంది. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ప్రైవేట్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిత్రసీమలో ఛాన్సులు రావడం..ఆమె పాడిన పాటలు విపరీతంగా ఆకట్టుకోవడం తో అతి తక్కువ సమయంలోనే టాప్ సింగర్ జాబితాలో చేరింది. ప్రస్తుతం ఓ పక్క సింగర్ గా రాణిస్తూనే..వెండితెర ఫై పలు పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది.

మంగ్లీ ప్రతి పండగకు ఒక ప్రైవేట్ సాంగ్ పాడి స్పెషల్ వీడియో షూట్ చేయించి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా బోనాలపై ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తుంది. ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి గాయం అయిందని సమాచారం. దీంతో యూనిట్ వెంటనే మంగ్లీని హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారని, మంగ్లీని కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని తెలిపినట్టు సమాచారం.