తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ..?

తెలంగాణ ఫై బిజెపి అధిష్టానం పూర్తి ఫోకస్ పెట్టింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పక్క ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యముగా రాష్ట్రంలోని పలువురికి కీలక బాధ్యతలు అందజేసే పనిలో పడింది. తాజాగా బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ ను నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో సీనియర్ నాయకురాలిగా ఉన్న డీకే అరుణకు పగ్గాలు అప్పగించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు ఇవ్వనున్నారని సమాచారం. ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్ష మందితో ఈ సభ జరిపేందుకు కాషాయ వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోన్నాయి. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చేలోపే రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు జరగనున్నాయని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తదేమో చూడాలి.